గచ్చకాయని ఫీవర్ నట్ అంటారు . ఈ గింజని కాసేపు అరగదీస్తే వేడిగా అయిపోతుంది . ఈ గచ్ఛ పొదకు ముళ్ళు ఎక్కువగా ఉండటంలో పంటపొలాలకు కంచెగా వేస్తూ ఉంటారు . ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి . ఈ గింజల నుంచి తీసిన నూనె తో మర్దనా చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి . డయేరియా ,కోసెంట్రీ ,చర్మవ్యాధులు ,ఆస్తమా, దగ్గు,జ్వరం మొదలైన వ్యాధుల నివారణలో ఈ గచ్చకాయల్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు . ముఖ్యంగా ఇది జ్వరాన్ని వెంటనే తగ్గిస్తుంది అంటారు .

Leave a comment