అమెరికా లో మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల కోసం పోరాడుతున్న ఎన్ ఎ ఆర్ ఎ ఎల్ ప్రో ఛాయిస్ అమెరికా సంస్థ కు ఇటీవలే అధ్యక్షురాలిగా ఇటీవలే ఎన్నికయ్యారు మినీ తిమ్మరాజు. అమెరికాకు వలస వెళ్ళిన తెలుగు కుటుంబానికి చెందిన మినీ అక్కడి రాజకీయాల్లో పౌర ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ లో క్రియాశీలంగా ఉన్న మినీ 2015-16 మధ్య అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు నేషనల్ ఉమెన్ ఓట్ డైరెక్టర్ గా వ్యవహరించారు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు ప్రచార సలహాదారుగా ఉన్నారు. పౌర హక్కుల రంగంలో అందించిన సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

Leave a comment