భూటాన్ ఆసియా దేశాల అన్నింటికంటే సంతోషంగా ఉండే దేశమని ప్రపంచ దేశాలలో ఎనిమిదవ స్థానంలో ఉందని బిజినెస్ వీక్ రాసింది. కానీ ప్రపంచ సంతోష నివేదిక 156 దేశాలలో భూటాన్ కు 95 వ స్థానం ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక, ప్రపంచ దేశాల సర్వే ఆయా దేశ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు భావిస్తున్నారో తెలియజేస్తుంది. 2021 నివేదికలో 149 దేశాల్లో సర్వే లో భారతదేశం 139 వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అందరికంటే సంతోషంగా ఉన్న ప్రజలు ఫిన్ లాండ్ లో ఉన్నారు. ఆ తర్వాత ఐస్ ల్యాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్ లాండ్స్, కెనడా, జపాన్, సింగపూర్ లు ఉన్నాయి. అన్నింటి కంటే దుఃఖంలో ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్.

Leave a comment