Categories

మహారాష్ట్ర లోని పన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫైర్ ఫైటర్ గా పనిచేస్తున్నారు శుభాంగి ఘులే. ఈ మధ్యనే అమెరికాలోని అలబామాలో జరిగిన 21వ ‘వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని అందుకున్నది. భారతదేశపు ప్రతిష్టను మహిళా శక్తిని చాటి చెప్పుతోంది శుభాంగి గెలుపు. ఈ పోటీలో 50 దేశాల నుంచి వచ్చిన అగ్రస్థాయి పోలీస్ ఫైర్ ఫైటింగ్ నిపుణులు పాల్గొన్నారు. ఇందులో అల్టిమేట్ ఫైర్ ఛాలెంజ్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది శుభాంగి. అంతరిక్ష నుంచి అగ్నిమాపక దళం వరకు అమ్మాయిలు తమ శక్తిని ప్రతిభను చాటి చెబుతున్నారు.