బెన్నీ కొట్టారత్తిల్,అతని భార్య మాలి కొట్టరత్తిల్‌ తమ స్వస్థలం అయిన కేరళ కొట్టాయం నుంచి ఈ సుదీర్ఘ యాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు తిరిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కి మొత్తం 8,263 కిలోమీటర్లు నడిచారు. ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా అనే రికార్డ్  సాధించారు ఈ కేరళ దంపతులు. మొత్తం 216 రోజుల యాత్ర లో చలికాలం,ఎండాకాలం చూశారు అమృత్ సర్, మురుడేశ్వర,  రిషికేశ్,బుద్ధగయ, వైష్ణోదేవి ఇవన్నీ కాళ్లతో నడుస్తూ చూసి సంతోషించారీ దంపతులు యాత్ర అనుభవాలను ‘వికీస్‌ వండర్‌ వరల్డ్‌’లో వీడియోలుగా పోస్ట్‌ చేశారు.

Leave a comment