Categories
WhatsApp

ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం.

ప్రత్యేకమైన ముఖ్యమైన సందర్భాలుంటాయి. తొలిసారి జీవితంలోకి ఆహ్వానించబోయే అమ్మాయిని కలుసుకోవడం, ఏదైనా కార్పోరేట్ సంస్థలో ప్రజంటేషన్ ఇవ్వబోవడం, ఇలాంటి విషయంలో ముందుగా తెలియని ఆతృతచుట్టేస్తుంది. తోలి ఇంప్రెషన్ చాలా ముఖ్యం. గుడ్ లుకింగ్, సరైన అప్రిషియేషన్స్ తోలి పాత్ర వహిస్తాయి. రూపం అనేది సహజంగా వచ్చేదే. దీని మెరుగులు దిద్దు కోవాలి. ఇక్కడ మేరుగులంటే మేకప్ కాదు. ముఖం జిడ్డు కారుతున్న మిస్ మ్యాచ్ వస్త్రధారణలో కనిపించినా ముందు చూసే వాళ్ళ సంగతి అలా ఉంచితే మన పైన మనకే విశ్వాసం వుండదు. శరీరం సువాసనతోవుండాలి. కార్పోరేట్ లుకింగ్ డ్రెస్సింగ్ అవసరం సూట్ వేసుకున్నా, సాదాగా కనిపించినా కాన్ఫిడెంట్ గా, హుందాగా కనిపించాలి, అనిపించాలి. హెల్దీగా, ఎనర్జిటిక్ గా వుండాలి. చక్కని గ్రుమింగ్, తాజా సువాసన, హుందాతనం అన్నీ కలిస్తే ప్రశంశలు అవే వచ్చేస్తాయి.

Leave a comment