అందమైన సినిమా నటుల డైటింగ్ రహాస్యాలు వింటుంటే కాస్త శ్రమ పడితే ఎవరైన అంత ఫిట్ నెస్ తో ఉండవచ్చు అనిపిస్తుంది. నటి తాప్సీ ఉయయాన్నే ఒక లీటర్ గొరువెచ్చని నీరు తాగుతోందట. ఆ నీళ్ళలో నిమ్మకాయ ముక్కలు ,పూదీనా ,కీరా ముక్కలు ఉంటాయి. దాని వల్ల డిటాక్సిఫికేషన్ తో శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయంటుంది. అలాగే డైటీషియన్స్ హెచ్చరికగా చెప్పే మంచి డైట్ ఎప్సుడు ద్రవ పదార్ధాల రూపంలో ఉంటుంది. తప్పకుండా సూప్ ఉండాలి. అలాగే మెడిటేరనియన్ డైట్ లో తాజా కూరగాయలు,బీన్స్ ,ఓట్స్,బ్రౌన్ రైస్ ,చేపలు, గుడ్డు,పెరుగు ,వెల్లుల్ని,దాల్చిన చెక్క ,మిరియాలు ఉంటాయి.అలాగే ఉడికించిన బంగాళ దుంపల్లో పోటాషియం తో సహా ఇతర పోషకాలు ఎన్నో ఉన్నాయి. డైట్ ఫుడ్ రహాస్యం తెలుసుకొంటే కొన్ని రకాల కాంబినేషన్స్ తో ఆరోగ్యంగా ఫిట్ గా ఉండవచ్చు.

Leave a comment