నాకు బరువు పెరగటం తగ్గటం కొత్త కాదు సినిమాల్లోకి రాకముందు 125 కిలోలు ఉండేవాడిని. 2007 లో నా వి.ఎఫ్.ఎక్స్ సంస్థ అమ్మేసి పూర్తి స్థాయిలో సినిమాలు చేయాలనుకొన్న. హీరో అవ్వాలంటే ఫిట్ నెస్ ముఖ్యం కదా. హీరో పొట్టతో కనబతే ప్రేక్షకులు మెచ్చుతారా ? అందుకోసం ఎనిమిది నెలల్లో 20 కిలోలు తగ్గాను వారంలో ఆరురోజుల స్ట్రిక్ట్ డైట్ అంటారు రాణా. బాహుబలిలో బల్లాలుడి గా భారీ ఆకారంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రాణా తరువాత అరణ్య సినిమాలో జంగిల్ మాన్ బాన్ దేవ్ అవతారం ఎత్తాడు. బల్లాళుడి నుంచి బాన్ దేవ్ కు మారేందుకు మళ్ళి 30 కిలోలు తగ్గాడు. బాడీ బిల్డర్ క్రీడాకారుడు ఫిట్ నెస్ కోసం ఎంత కష్టపడతారో అలాగే నేను జిమ్ లో వర్క్ వుట్స్ చేస్తాను వృత్తిలో కూడా జిమ్ ఒక భాగం అయింది. జిమ్ కి వెళ్లని రోజు ఎదో లోటుగా అనిపిస్తుంది. బాన్ దేవ్ గా మారేందుకు రోజు రెండు గంటలు వర్క్ వుట్స్ చేశాను రన్నింగ్,సైక్లింగ్, ఈత, స్కిప్పింగ్ వంటి కార్డియో సెషన్స్. అసలు బాహుబలి తర్వాత నేను పూర్తిగా బరువు తగ్గటం పైనే ద్రుష్టి పెట్టాను అంటారు రాణా.నిజానికి బరువు తగ్గటం మాట చెప్పినంత కాదు నిపుణులు పర్య వేక్షణ లో వర్క్ వుట్స్ చేయాలి. కఠిన నియమాలతో డైట్ పాటించాలి. ఇష్టమైన ఆహారం కళ్ళముందు ఉన్న తినకుండా కంట్రోల్ చేసుకోవాలి రాణా ఎన్నో ఇంటర్యూలలో తన డైట్ ఎక్స్ర్ర్ సైజ్ ల సంగతి చెపుతూ నేను ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోను ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారం ఉప్పు కలిగిన వంటకాలు తగ్గించాను ఓట్ మీల్స్,కూరగాయాలు ఆకుకూరలు వంటి తేలికపాటి ఆహారంలో బరువు తగ్గటం సులభమైంది కొన్ని నెలల పాటు మాంసాహారం ముట్టుకోలేదు అంటారు సెలబ్రెటీ జోన్ లోకి వెళ్ళటం అంటే క్రమశిక్షణ పాటించటం వెండి తెర పై వెలగాలంటే స్మార్ట్ గా కనిపించాలంటే లైఫ్ లో రుచులు మర్చిపోవాల్సిందే మరి !

Leave a comment