ఆకర్షణీయమైన నా రూపానికి క్రమం తప్పని వ్యాయామం కారణం అంటోంది దిశాపటాని . నా వ్యాయామం లో డాన్స్,ఈత,వెయిట్ ట్రైనింగ్ యోగ ఉంటాయి. నా ఫిట్ నెస్ లో డాన్స్ దే ప్రధాన పాత్రా అంటోంది. నేను న్క్సేర్ డాన్సింగ్ అనే కొత్త నాట్యం నేర్చుకొన్నాను. డాన్స్ తో మనసు తేలిక అవుతోంది. శరీరానికి చక్కని వ్యాయామం కూడా అందుతోంది. శరీరాన్ని తేలికగా వుంచాలి అనుకొంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలి అంటోంది దిశా పటాని . రోజు 8 గంటలు నిద్రపోవాలి ఒంట్లో కొవ్వు పెరగకుండా ఉండాల అంటే మెటబాలిజం వేగంగా ఉండాలి. అందుకోసం నేను తరుచుగా నీళ్ళు తాగుతాను. నా ఫిట్ నెస్ రహస్యం ఇదే అంటోంది దిశా పటాని. మా అమ్మాయికైనా ఇవే ఫిట్ నెస్ మంత్రాలే . చక్కని నిద్ర ,వ్యాయామం మంచి పోషకాలతో కూడిన భోజనం ఇవే కదా చక్కని రూపానికి మూలం.
Categories