ముఖానికి స్టీమ్ ఇవ్వటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బ్యూటీ పార్లర్ లలో ఫేషియల్ కి ముందు ఆవిరి పడుతూ ఉంటారు. ఈ ఆవిరిని ముఖ చర్మానికి దగ్గరగా ఉంచకూడదు. షవర్ బాత్ కు నీరు ఎంత దూరం నుంచి పడతాయో అంత దూరం నుంచి ఆవిరి ముఖానికి తగలాలి.దీనివల్ల చర్మం లోని పోర్స్ తెరచుకొని మలినాలు బయటికి వస్తాయి. ఆవిరి పట్టక క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పొడిగా ఉన్నా మెత్తని టవల్ తోనే ముఖాన్ని తుడుచుకోవాలి. చర్మం పొడిబారినట్టు అనిపిస్తే మాయిశ్చరైజర్ వాడాలి ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు.

Leave a comment