తినే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ను బట్టి వాళ్ళ మనస్థత్వం చెప్పొచ్చు అంటారు మనస్థత్వ నిపుణులు . చాక్లట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు ఇష్టపడతారు . తమను తాము ఎంతో ప్రేమించు కొంటారు . వెనిలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ట్రెడిషనల్ భావాలు కలిగి ఉంటారు . స్ట్రాబెరీ ఫ్లేవర్ హుందగా ఉత్తేజంగా ఉండేవాళ్ళుకు నచ్చుతుంది . కాఫీ ఫ్లేవర్ ఇష్టం అంటేమటుకు వాళ్ళకు కొత్త పనులు ఇష్టం కానీ ఆ పనులు పూర్తి చేయటంలో చాలా అలసత్వం చూపిస్తారు . మింట్ చాక్లట్ ఫ్లేవర్ నచ్చితే వాళ్ళకో లక్ష్యం ఉంటుంది . ఎప్పుడూ నమ్మకస్తులు గా ఉంటారు . బటర్ స్కాచ్ ఇష్టపడే వాళ్ళుచాలా ఉదార స్వభావులు . చురుకుగా ఉంటారు . కష్టపడి పని చేసి మంచి ఫలితాలు పొదలనుకుంటారు .

Leave a comment