ప్రబంధ నాయకుల బొమ్మల్లో చాలా మంది పూల అలంకరణతో కనిపిస్తారు.కణ్యాశ్రమం లో శకుంతల వర్ణ చిత్రాలు ఆమె తలలో మెడలో చెవులకు,చేతులకు పూల అలంకరణలతో కనిపిస్తుంది .వర్ణ శోభితమైన పువ్వుల కంటే అందమైన ఆభరణం ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది. మన దేశపు వివాహ వేడుకల్లో వధువు బంగారు నగలతో అలంకరించుకొంటే. పాశ్యాత్య దేశాల్లో సహజమైన పువ్వులనే అలంకరించుకుంటారు. ముఖ్యంగా చేతులకు పెట్టుకునే బ్రాస్ లెట్లు అక్కడ ఎంతో మంది ఇష్టపడే ఆభరణం సహజమైన పూవులతో  చేసిన బ్రాస్ లెట్లు చాలా అందంగా ఉంటాయి. సహజమైన పువ్వులతో పాటు ప్లాస్టిక్ పువ్వులవీ అంతే అందం. క్లే తో చేసినవి కూడా అత్యంత సహజంగా ఉంటాయి .ఇప్పుడా పువ్వుల బ్రాస్ లెట్స్ ట్రెండ్ మన దేశం లోకి వచ్చింది. మదర్స్ డే కి, బర్తడే లకు ఇవి బహుమతులుగా ఇస్తున్నారు గులాబీలు లిల్లీలు అందమైన రంగుల్లో బంతి చామంతి వాటికి తోడుగా పెరల్స్ తో ఈ బ్రాస్ లెట్లు ఖరీదైన బంగారు నగల కంటే అందంగా ఉన్నాయి .

Leave a comment