హనుమకొండ జిల్లా మల్లారం ఎ.ఎన్.ఎం  మహమ్మద్ శుక్రా తాండాల్లో చేసిన నిరుపమాన సేవలకు గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు తీసుకుంది భీమదేవరపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లారం సబ్ సెంటర్ లో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహమ్మద్ శుక్రా ఎంతో కాలం తండాల్లోనే  కాలినడకన తిరుగుతూ వారికి వైద్యం చేసేవారు. ఏ రోగం వచ్చినా మంత్రాలను నమ్ముకొని మూఢాచారాల తో బతికే తాండాల్లో పిలిస్తే పలికే డాక్టరమ్మగా దగ్గరయ్యారు 2011, 2017,2009 సంవత్సరాల్లో జిల్లా కలెక్టర్ ల నుంచి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు తీసుకున్నారు. 2017 లో బాబు జగ్జీవన్ రామ్ అవార్డ్, సావిత్రిబాయి పూలే అవార్డు తీసుకున్నారు.

Leave a comment