సృష్టిలో చాలా అందమైన పువ్వులు గులాబీ మొదటి వరుసలో ఉంటుంది. వందల రకాల గులాబీలు చూశాం కానీ ఎడారుల్లో ఇసుక నేల పైన విరిసే రోజ్ రాక్ ని చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓక్లహోమా ఎడారిలో విరిసే గులాబీలు చూస్తుంటే సృష్టి విచిత్రం అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఇసుక నేల పైన అందాల గులాబీలు ఎలా వచ్చాయి అంటే మాత్రం సైన్స్ పాఠం లా చెప్పాలి. ఖనిజాలాన్ని నేలమాళిగల్లో గూడుకట్టుకుని రత్నాల్లా క్రిష్టల్స్ లా రూపాంతరం చెందుతాయి అని తెలిసిందే కదా అదే మాదిరిగా కొన్ని ఖనిజాలు ఇలా  నేలపైనే విచ్చుకున్న గులాబీలా రూపంలో ఏర్పడతాయి సాధారణంగా లోతు తక్కువగా ఉండే ఉప్పునీటి కయ్యల్లో నీరంతా ఆవిరై పోవటం తో అక్కడ ఉన్న జిప్సమ్ లేదా బేరైట్ ఖనిజాలు క్రిష్టల్స్ లా రూపం పోసుకుంటాయి అలా ఏర్పడే దశలో అక్కడ వీచే గాలి కారణంగా  ఒక్కసారి ఇలా పువ్వు ఆకారాన్ని తీసుకుంటాయి. సాధారణంగా ఈ తెల్లగా ఏర్పడతాయి కానీ ఎడారి ప్రాంతాల్లో మాత్రం అచ్చం గులాబి పూవుల్లా కనిపిస్తాయి స్థానికంగా ఉండే ఇసుకని బట్టి ఈ రాత్రి పూలు లేత ఎరుపు నుంచి ముదురు ఎరుపు వర్ణం అద్దుకుంటాయి కొన్ని చోట్ల ఈ రాళ్ళు ఒకటి రెండు పువ్వుల్లా రూపం పోసుకుంటే మరికొన్ని చోట్ల ఒక దాని మీద ఒకటి చేరి గుత్తులు గుత్తులుగా గులాబీలు కనిపిస్తాయి. వీటిని జిప్సమ్ రోజ్, సెలవైట్ రోజ్ అంటారు ఓక్లహోమా ఎడారిలో కనిపించే గులాబీలు మాత్రం నిజం పువ్వు లాగే ఉంటాయి. ఈ రాతి పువ్వులు చూసేందుకు పర్యాటకులు అన్ని దేశాల నుంచి వస్తారట !

Leave a comment