చిన్న ఉయ్యాలలో దుప్పటి కప్పుకున్న పాపాయిల్లా ఉంటాయి. ఎ పూవులు.పేరు యాంగ్యులోవా యూనిఫ్లోరా ఆర్కిడ్లు. వీటినే స్వాడెల్డ్‌ బేబీ ఆర్కిడ్స్‌ అనీ అంటారు.ఇవి ఆండెస్‌ పర్వతశ్రేణుల్లో కనిపించే ఈ రకంలో అనేక రంగులూ ఉన్నాయి. ఈ పూల రేకులు అచ్చం తులిప్‌లని పోలి ఉండటంతో వీటిని తులిప్‌ ఆర్కిడ్స్‌ అనీ పిలుస్తారు. ఇవి పది డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత దగ్గర రెండు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. ఇవి విరిసిన పువ్వులు చాలాకాలం వాడిపోకుండా ఉంటాయి. వీటిని కట్‌ఫ్లవర్స్‌లోనూ వాడుతారు.ఈ మొక్కల్ని గ్రీన్‌హౌసుల్లోనూ పెంచుకోవచ్చు.

Leave a comment