అందమైన సువాసన భరితమైన పూవులు సౌందర్య పోషణకు ఎంతగానో ఉపయోగపడతాయి. కలువ పూల రేకులను మెత్తగా చేసి కాసిని పాలు,బాదం గింజల పొడి కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవాలి అరగంట తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా బిగుతుగా అయిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ మాస్క్ వేసుకోవచ్చు. గులాబీలు మెత్తని ముద్దగా చేసి వట్టి వేర్ల పొడి,పెసర పిండి,పాలు తేనె కలిపి ముఖానికి అప్ప్లై చేసి కాస్సేపయ్యాక చల్లని నీళ్లతో కడిగితే మొహ చర్మం నిగనిగలాడుతోంది. మల్లెపూల గుజ్జులో పాలు,ముల్తానీ మట్టి,ఒట్స్,ఆలివ్ నూనె కలిపి ముఖానికి పూతలా వేసుకొని అరగంట తర్వాత కడిగేస్తే మృతకణాలు మొటిమలు పోతాయి. మల్లెలు వార్ధక్యఛాయలను తగ్గిస్తాయి.

Leave a comment