ఫోర్బ్స్ పత్రికా ఈ సంవత్సరం వివిధ రంగాలతో సైతం ప్రదర్శించిన యువ కెరటాల జాబితా విడుదల చేసింది. 30 ఏళ్ల లోపు గల 30 మంది భారతీయుల జాబితాను 30 అండర్ 30 పేరిట ఫోర్బ్స్ విడుదల చేసింది . ఇందులో తాప్సీ పన్ను ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో చోటు సంపాదించింది. వివిధ భాషల్లో నటించిన తాప్సీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ దర్శకుడు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో రూపొందించిన పింక్ చిత్రంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో మీనల్ అరోరా పాత్రలో తాప్సీ చక్కని నట ప్రతిభ కనబరిచింది . అందాల తార తాప్సి కి ఈ చిత్రం మంచి సక్సెస్ ను అందించటం తో పాటు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. చేతిలో ఎన్నో సినిమాల్లో బిజీగా ఉన్న తాప్సీ తన పాత్ర ద్వారా మహిళలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించినందుకుగాను ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. భవిష్యత్తులో మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం పై పోరాటం చేస్తానంటోంది తాప్సీ పన్ను.
Categories