ఒక్క రకం పండ్లు కూరగాయల్లో ఒక్క రకం పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల పండ్లు ఆయా సీజన్ లోనే దొరుకుతాయి కొన్ని రకాల కాయగూరలు పండ్లు కొన్ని సూపుల్లో ఎంతో రుచి ఇస్తాయి. అన్నింటినీ నిల్వ చేసుకుని వాడుకునేందుకు  వీలుగా ఈ మధ్య డ్రైడ్ పండ్లు కూరగాయలు వస్తున్నాయి. పోషకాలు పోకుండా నీటిని తీసి ఎండబెట్టినవి ఈ డ్రైడ్ ప్యాకెట్లలో ఇస్తున్నారు. ఇందులో ఏం రసాయనాలు వాడుతున్నారో తెలియదుగానీ ఈ బాధ లేకుండా ఇంట్లోనే ఈ పండ్లు కూరగాయలు ఎండ పెట్టుకునే లాగా చిన్న సైజ్ ఫుడ్ డీహైడ్రేటర్ మిషన్ లు వస్తున్నాయి. అరలు అరలుగా ఉండే వీటిలో కూరలు పండ్లు ముక్కలు పెట్టి స్విచ్ ఆన్ చేస్తే అవి ఒరుగుల్లా  ఎండిపోతాయి. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేందుకు వంటల్లో వాడేందుకు ఉపయోగించుకోవచ్చు.

Leave a comment