నాలుగు దశాబ్దాల పాటు ఐదు వేలకు పైగా చిత్రాలు గీసి పదమూడు వందల మందికి పైగా నేరగాళ్లకు శిక్ష పడటం లో సాయం చేసింది లోయిస్ గిబ్బన్. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో పుట్టిన లోయిస్ మనుషుల చిత్రాలు గీయగలదు నేరస్తుల బొమ్మలను వివరాలు సాయంతో గీస్తూ ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరింది. చిన్నతనంలోనే తనపై అత్యాచారం చేసి పారిపోయిన దుర్ఘటన ఆమెకు ఒక కొత్త వృత్తి పట్ల మమకారం పెంచింది. వివరాలు వింటూ బొమ్మలు గీయగల లోయిస్ పేరు గిన్నిస్ రికార్డ్ లో నమోదయింది. 72 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ పొందింది ఆసక్తి ఉన్నవాళ్ళకి ఫోరెన్సిక్ ఆర్ట్ లో శిక్షణ ఇస్తోంది లోయిస్ గిబ్బిన్ .

Leave a comment