వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త ఒత్తిడిలో కూడుకున్న వ్యవహారమే ఆఫీస్ లో సాగినంత ఏకాగ్రత ఇంట్లో కష్టమే.ఈ ఒత్తిడి కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఈ యాప్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే బావుంటుంది .ఫోన్ నిరంతరాయంగా చూస్తుంటే గానీ పని జరగదు అలాటి సమయంలో forest app ని ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు ఓ మొక్కను ఫోన్ లో నాటితే చాలు కాసేపు ఫోన్ దూరంగా పెట్టవలసిందే .ఒక విత్తనం ఫోన్ లో మట్టి లో నాటిస్తే చాలు కాసేపు ఫోన్ ముట్టుకోకపోతే ఆ విత్తనం మొలకెత్తి వృక్షంగా అయిపోతుంది .మధ్యలో ఫొన్ ని ముట్టుకొంటే లేదా వాడుకొంటే ఆ మొక్క కాస్తా చనిపోతుంది .మంచి స్కోర్ తెచ్చుకొంటే నిజమైన మొక్కను నాటే బాధ్యత యాప్ తీసుకుంటుంది ఇలా ప్రకృతికి సాయం చేసే యాప్ ని ఇన్ స్టాల్ చేసుకొని మనసులు ఒత్తిడిని పెంచుతున్న మొక్కల్ని చూస్తూ పోగొట్టుకోవచ్చు .

Leave a comment