కరోనా తర్వాత జీవితం లో చాల మార్పులు వచ్చి తీరుతాయి. ముఖ్యంగా గుంపుగా థియటర్స్ కు పోయి సినిమాలు చూడగలమా అన్నది సందేహమే. నెమ్మదిగా వెబ్  సీరీస్ కు ,ఇంట్లోనే సినిమాలు చూసేందుకు అలవాటుపడి తీరవలసిందే. అలా మొదలెట్టాలి అనుకొనే వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీరీస్ మొదలు పెట్టవచ్చు. స్టోరీ లో నలుగురు కథానాయకులు. దామిని జర్నలిస్ట్, ఉమాంగ్ ఫిట్ నెస్ ట్రైనర్ ,అంజన్ లాయర్. సిద్ది వీళ్ళ నలుగురికీ ఇష్టమైన ఫ్రెండ్ . ఈ నలుగురు యువతులు జీవించే విధానం,చుట్టు ప్రపంచం ఆడవాళ్ళను చూసే పద్ధతి పైన జోక్స్ వాళ్ళ వ్యక్తిత్వం ఇవన్నీ కలిపి ఈ సీరీస్ ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తయ్యాయి.  అమ్మయిలు ఎలా ఉండాలో సమాజం నిర్ణయిస్తు ఉంటే,అమ్మాయిలు ఎలా ఉండాలి అనుకొన్నారు ఈ సీరీస్ చెపుతాయి. తప్పకుండా చుడండి.

Leave a comment