నా చిన్నతనంలో కధలను బయటకి వినిపించేలా చదివేదాన్ని తల్లి నాయిక మా పిల్లలకు కధలు చెపుతూ అందులో ఉన్న ఆనందం రుచి చూశాను .ఇప్పుడు ఇంటికే పరిమితం అయినా పిల్లలకు కధల ద్వారా స్వాంతన కలిగించాలనుకొన్నాను అంటున్నారు .అమెరికా మాజీ ప్రధమ మహిళా మిషెల్ ఒబామా .ప్రతి సోమవారం పిల్లలకు కధలు చెప్పేందుకు ఓ కిడ్స్ ఛానల్ ద్వారా ముందుకొచ్చారు .చాలా దేశాల్లో పాఠశాలలు మూసేశారు .ఇంట్లోనే తల్లి దండ్రులు పిల్లలను చదివించాలని  ప్రభుత్వం  సూచించింది .ధాంన్తో  పిల్లలు ఇంటిదగ్గరే ఉంటూ ఎంతో వత్తిడిలో ఉంటున్నారు .పిల్లల లో ఉత్సాహం నింపేందుకు మిషెల్ కధలు చెప్పేందుకు సిద్ధం అయ్యారు .వైట్ హౌస్ లో ఉన్నపుడు కూడా పిల్లల కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు మిషెల్ .

Leave a comment