ఢిల్లీ సిటీబస్ ల్లో మహిళ లందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వచ్చింది . ప్రయాణ ఖర్చులు భరించ లేక ప్రయాణ భద్రత లేక ,అన్ని అర్హతలుండీ అవకాశాలు లేక గృహిణులుగా ఇళ్లలోనే మిగిలి పోయినా వారికీ ఈ మొబిలిటీ తో కొత్త అవకాశాలు తెచ్చి పెడుతుందని స్త్రీల ను సాధికారత వైపు నడిపిస్తుందని ప్రభుత్వం నమ్మి ఈ సదుపాయం కల్పిస్తోంది . ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు . స్త్రీల భద్రత కోసం అన్ని బస్ లలో కళకలిపి 13 వేళా మంది మార్షల్స్ నియమితులయ్యారు . ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ప్రస్తుతం 3700 బస్ లో నడుపుతుంది . వీటన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణాలు . మహిళలకు లేత గులాబీ రంగులు ఉండే టికెట్ ను కండక్టర్ ఉచితంగా ఇస్తాడు . బస్ ఎక్కినా మహిళా ప్రయాణికులకు పది రూపాయిల టికెట్ ఇస్తారు . ఆ టికెట్ తో బాస్ లో ఎక్కడి నుంచి ఎక్కడి కైనా ప్రయాణం చేయచ్చు . ఈ బస్ దిగి ఇంకో బస్ ఎక్కితే అక్కడో టికెట్ ఇస్తారు . మహిళలు ఢిల్లీ మొత్తం టికెట్ లేకుండా ప్రయాణం చేయచ్చు .

Leave a comment