ఈ కరోనా సమయంలో బ్యూటీ క్లినిక్ లకు వెళ్లే సాహసం చేయకుండా ఇంట్లోంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు తలస్నానం చేసిన తల జిడ్డుగా అనిపిస్తే స్నానం చివర్లో మగ్గు నీళ్ళలో వంటసోడా కలిపి కడిగితే జుట్టు మెరిసిపోతుంది. జిడ్డు పోతుంది రెండు స్పూన్ల బియ్యం పిండి ,అంతే టీ డికాషన్ టేబుల్ స్పూన్ తేనె కలిపిన మిశ్రమం మొహానికి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మృతకణాలు తొలగిపోయి మృదువైన చర్మం సొంతం అవుతుంది.ఒక టేబుల్ స్పూన్ పాల పొడిలో నాలుగు స్పూన్ల కీరదోస ముక్కలు,టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు వేసి మిక్సీలో మెత్తగా చేసి ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు ముఖం మెరిసిపోతుంది. తాజాగ  చర్మం నిగనిగలాడుతుంది.

Leave a comment