శరీరానికి విటమిన్లు అవసరం ఎంతగా వుందో, అవి వేటిలో లభిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం.చర్మ కణాల పునరుత్తేజం ఉపయోగించే ఎ విటమిన్ చిలకడ దుంపలు, బ్రోకలి, క్యారెట్, ఫిష్ ఆయిల్, ఆప్రికాట్స్ లో దొరుకుతుంది. బికాంప్లెక్స్ విటమిన్స్, స్కిన్ ఫుడ్స్, బి3, బి6 కుడా చర్మాన్ని కాపాదేవి. మీట్, పౌల్ట్రీ లివర్, ఈస్ట్, అవకాడో, పాలు, గుడ్లు, పెరుగు ఈ విటమిన్ కు ఆధారం. కోలాజెన్ ను పెంచి చర్మం మృదువుగా వుండేందుకు సహకరించే విటమిన్ స, బ్రోకలి, బెల్ పెప్పర్, కొత్తి మీర, మొలకలు, నిమ్మరసం, స్ట్రాబెర్రీల్, బొప్పాయి, కమలా, ద్రాక్ష, పైనాపిల్, టొమాటోల్లో దోరుకుతాయి. విటమిన్-ఇ, బాదం, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజల్లో విటమిన్ K  పాలకూర, తోటకూర, ద్రాక్ష, కివి పండ్లలో దోరుకుతాయి.

Leave a comment