బాగా పండిన బొప్పాయి ఫ్రూట్ ఫేషియల్ కు బాగా ఉపకరిస్తుంది. ఈ పండు గుజ్జుని అన్ని రకాల చర్మాల వాళ్ళు వాడుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక టీ స్పూన్ శనగపిండి పెరుగు వేసి ప్యాక్ లా వేసుకుని ఓ గంట తర్వాత కడిగేస్తే ఎండకు కమిలిన మొహం నలుపు మాయం అవుతుంది. మెడ,మో చేతులు,పాదాల నలుపు వదలాలంటే బొప్పాయి ముక్కతో ఐదు నిమిషాలు రుద్దితే పోతుంది. బొప్పాయిలో సహజసిద్దమైన మైండ్ బ్లీచ్ తో పాటు మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది.మాములుగా బ్లీచ్ చేసి ఆ తర్వాత మాయిశ్చరైజర్ వాడితే కలిగే ఫలితం వట్టి బొప్పాయి గుజ్జుతో వచ్చేస్తుంది.

Leave a comment