ఇంట్లో వండిన కూరగాయలు పళ్ళు ఎంత జాగ్రత్త పెట్టిన ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేస్తాయి. చిన్న ఈగల్లా ఉండే ఇవి ఓసారి వచ్చాయంటే ఇల్లంతా చూటేస్తాయి. ఇవి కుట్టకపోయినా అన్నింటిపైనా వాలినా అనారోగ్యమే. పండ్లు కూరగాయలు ఇంటికి రాగానే కడిగి ఆరనిచ్చి భద్రం చేయాలి. పగిలిన పండిన రసాలు మిగతా వాటికి అంటుకున్న ఈగలు వెంటనే వచ్చేస్తాయి. పావు కప్పు యాపిల్ సిడర్ వెనిగర్ ఒక గిన్నెలో పోసి ఓ స్పూన్ డిష్ వాష్ ను కలిపి ఈగలు ఎక్కువగా ఉన్న చోట ఉంచిన ఆ వాసనకు ఈగలు పోతాయి. నీళ్ళు పంచదార వెనిగర్ డిష్ వాష్ కలిపి ఈగలు వాలే చోట్ల చిలకరిస్తే అవి వాలి చనిపోతాయి ఇలా రోజూ చేస్తూ ఉండాలి.

Leave a comment