ఫ్యాషన్ వరుస లోకి పువ్వులతో పాటు పండ్లు కూడా వచ్చి చేరాయి. ఫ్రూట్ జ్యువెలరీ బ్రాండ్ మొదలైంది. రాళ్ళూ, ముత్యాలు కూర్చిన పండ్ల డిజైన్ లతో చెవిపోగులు,బ్రాస్ లైట్స్,పెండెంట్లు వచ్చేశాయి. చక్కని రాళ్ళు కూర్చిన నిమ్మతొనలు. ఎర్రని దానిమ్మగింజలు,స్టయిల్ గా వేలాడే అరటిపండ్ల లోలాకులు,ఆకుపచ్చని రాళ్ళలో నారింజ స్టడ్స్ ఇవొచ్చి జ్యువెలరీ ట్రెండ్ . పండ్ల,గింజల ఆకృతులు ఆభరణాల్లో అమరిపోయి కాళ్ళని ఆకట్టుకొంటున్నాయి తేలికైన వెండి హారాలు దగ్గర నుంచి ,వన్ గ్రామ్ గోల్డ్ నుంచి వజ్రాల నగల్లోనూ ఇవ్వాళ ఫ్రూట్ జ్యువెలరీ యువతను ఆకట్టుకొంటోంది.ట్రోపికల్ ప్రింట్స్ డ్రస్ కు రెడ్ చెర్రీ ఇయర్ రింగ్స్ పర్ ఫెక్ట్ మ్యాచింగ్ అంటున్నారు స్టయిలిస్ట్ లు .

Leave a comment