మార్కెట్ లోంచి తేగానే పండ్లు ,కూరలు వెంటనే ఫ్రీజ్ లోకి మార్చినా రెండుమూడు రోజుల్లోనే వాడిపోయి కనిపిస్తూ ఉంటాయి . ఇంకో రోజు ఆగి చూస్తే మొత్తం పాడైపోతాయి . అలా కాకుండా వాటిని తాజాగా ఉండేలా నిల్వ చేయాలంటే వాక్యూమ్ సీలర్ బాగ్స్ ఉపయోగపడతాయి . పదార్దాలు ఏవైనా సరే కూరలు,మాంసం వంటివి ఈ కవర్ లో పెట్టి వాటి చివర్లు ఉండే ఒక చిన్ని రంద్రం పైన ఈ వ్యాక్యూమ్ సీలర్ పెడితే పేపర్ కవర్ లో ఉండే గాలి మొత్తం పోతుంది . అప్పుడిక సరిపడా ఆక్సిజన్ లేక బాక్టీరియా వృద్ధిచెందదు . అందువల్ల కూరలు ,పండ్లు తాజాగా ఉంటాయి . ఈ వాక్యూమ్ సీలర్ ను కొంటె మాంసం కూడా పాడైపోకుండా తాజాగా ఉంచుకోవచ్చు .

Leave a comment