పిల్లల ఆరోగ్యం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి . కడుపులో బిడ్డ ఆరోగ్యానికి తల్లి తీసుకొనే ఆహారానికి సంబంధం ఖచ్చితం గా ఉంటుంది . పరిశోధకులు అది ఏనాడో తేల్చారు . తల్లి పుష్టికరమైన ఆహారం తీసుకొంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని తెలుపుతున్నాయి . అయితే పండ్లు ఎంత ఎక్కువగా తింటే బిడ్డ మేధస్సు అంత చురుగ్గా ఉంటుందని చెపుతున్నారు కెనడా లోని యూనివర్సిటీ ఆఫ్ అల్టెర్ట పరిశోధకులు 700 మంది పిల్లలపైనా ఈ పరిశోధన చేశారు . ఈ అధ్యయనం పండ్లు ఎక్కువగా తీసుకొన్నవాళ్ళకి ఆహారం తేలికాగా జీర్ణమై కష్టం లేకుండా హుషారుగా నడవ గలిగారనీ ,శరీరపు బరువు ఫీలవ్వ లేదన్న వాళ్ళకు పుట్టిన బిడ్డలు కూడా పుట్టుక నుంచే ఉత్సాహంగా ఉన్నారని చెపుతున్నారు.

Leave a comment