భారీ బ్రేక్ ఫాస్ట్ తో బరువు చాలా వేగంగా తగ్గించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. జర్మనీకి చెందిన లుబెర్ యూనివర్సిటీ పరిశోధికులు చేసిన తాజా పరిశోధనలు 23 సంవత్సరాల వయస్సున్న వారి లో ఒక పరిశోధన చేశారు అధిక కేలరీలున్న ఆహారం ఎక్కువ పరిమాణంలో ఉదయం నిద్ర లేవగానే ఇచ్చారు. మిగిలిన కొందరికి అదే ఆహారం డిన్నర్ లో ఇచ్చారు. చాలా రోజులు తరబడి చేసిన ఈ పరిశోధనలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అధికంగా తీసుకున్నవారిలో మెటబాలిజం పెరిగింది. అధిక కేలరీలు తీసుకొన్న అవి త్వరగా ఖర్చువుతున్నాయని పరిశోధకులు గుర్తించారు రాత్రి భోజనం తర్వాత కొన్ని గంటలు పాటు విశ్రాంతిగా ఉన్న తరువాత తీసుకొనే ఆహారం,అంతే బ్రేక్ ఫాస్ట్ ని శరీరం చాలా వేగంగా తీసుకొంటుందనీ,కేలరీలు చాలా త్వరగా కరిగి పోతాయని అధ్యయన కారులు  నిరూపించారు.

Leave a comment