అసలే కరోనా రోజులు పైగా ఎండలు బయట అడుగు పెట్టే ముందర ఒక సురక్షితమైన టోపి పెట్టుకోండి అటు స్టయిల్ గా ఇటు ఎండ నుంచి రక్షణ గా ఉంటుందీ అంటున్నారు ఎక్సపర్ట్స్. తలకు టోపీ ఉన్న కళ్ళకు సన్ గ్లాస్ పెట్టుకున్న మాస్కు తప్పని సరి కాలం ఇది.  అట్లాగే మొహం, మెడ, భుజాలు కప్పేలా స్కార్ఫ్ కట్టుకోక తప్పదు అయితే యాంటీ స్పిటింగ్ అవుట్ డోర్ సన్ స్క్రీన్  హ్యాట్స్ విత్ మాస్క్  అని పిలిచే ఈ హాట్ మాత్రం ఇన్ని రకాల రక్షణలు ఒకే చోట ఉన్నాయంటోంది.దీన్ని పెట్టుకుంటే ఎండ నుంచి కాలుష్యం నుంచి వైరస్ నుంచి తప్పించుకోవచ్చు. మొత్తం మొహం కవర్ చేసే ఈ హాట్ పెట్టుకుంటే సన్ స్క్రీన్ రాస్కో క పోయినా పర్లేదు అంటున్నారు తయారీదారులు.

Leave a comment