వర్షం వస్తూ ఉంటే హ్యాండ్ బ్యాగ్స్, షూ, చెప్పుల సంరక్షణ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.అవి లెదర్ వైనా వస్త్రాలతో తయారీ వైన కేర్ తీసుకోవాలి. షూలు బ్యాగ్ లలో సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచి భద్రపరచాలి. సిలికా తేమను పీల్చుకుని దుర్గంధాన్ని నిరోధిస్తుంది.హెయిర్ డ్రయ్యర్ తో షూలు బ్యాగ్ ల దుమ్ము పోగొట్టాలి. షూలు బ్యాగ్ లు భద్రపరచిన ర్యాక్ ల్లో నాప్త లీన్ ఉండలు కర్పూరం ఉప్పు పొట్లాలు పెట్టాలి. గాలిలో తేమ వల్ల వెలుతురు లేక ర్యాక్ ల్లో ఫంగస్ లు వస్తాయి.ఈ ర్యాక్ లో గోడలకు ఆనించకుండా  ఇవతలగా లాగి  గోడ మధ్యలో ఖాళీ స్థలం ఉండేలా చేయాలి. చాక్ పీస్ లు, ఉప్పు పొట్లాలు తేమను పీల్చుకుంటాయి కనుక అరల్లో వాటిని ఉంచాలి.

Leave a comment