అందంగా మేరుస్తూ పారదర్శకంగా వుంటే ప్లాస్టిక్, అచ్చంగా గాజులా వుంటే అది అక్రిలిక్. ఈ గాజు లాంటి ప్లాస్టిక్ తో చేసే ఫర్నిచర్ ఎంతో బావుంటుంది. ఈ గాజు అందాల ప్లాస్టిక్ తో ఆధునాతన గృహాల్లో ట్రెండీగా కనిపించేందుకు కుర్చీలు, టీ పాయ్ లు, బల్లలు, సూళ్ళు, బుక్ ర్యాక్స్ తయ్యారు చేస్తున్నారు. గాజు మాదిరి రంగు రంగుల్లో కనువిందు చేసే అక్రిలిక్ తో చేసే ప్రకటనలకు వాడె బోర్డులు, బొమ్మలు, షాండి లియర్ తో వంటింట్లో వాడే సామగ్రిని కూడా రూపొందిస్తున్నారు. ఇక అక్రిలిక్ ఫ్లవర్ వాజ్ ల అందమే అందం. సౌందర్య సాధనాల విషయానికి వస్తే కృత్రిమ గోళ్ళు అక్రిలిక్ నే. నాణ్యమైన ల్యూనైట్ తో తయ్యారైనా రంగు రంగుల అక్రిలిక్ బీడ్స్ అనేక కంపెనీలు ఫంకీ జ్యువెలరీ తయ్యారీలో వాడుతున్నారు. అంగుళం మన్దమ్ వుండే అక్రిలిక్ బులెట్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. ఒకప్పుడు శాస్త్రరంగంలో ఎక్కువగా వాడె అక్రిలిక్ ఇప్పుడు ఇంటి అలంకరణలో భాగామమైంది.

Leave a comment