గబ్రియేలా మిస్ట్రాల్‌ లాటిన్‌ అమెరికాలో 1889వ సంవత్సరంలో జన్మించింది. తల్లి తండ్రి ఇద్దరు కవిత్వం రాసేవారు తండ్రి పెంచిన పూల తోటలో పూలతోను, పక్షులతోను మాట్లాడుకుంటూ పెరిగిన మిస్ట్రాల్‌ తండ్రి కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో  బ్రతుకుదెరువుకోసం 16 ఏళ్ళ వయస్సులోనే పల్లెలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాల్సి వచ్చింది. విద్యావ్యవస్థ వైఫల్యాల పైన అనేక వ్యాసాలు రాసింది. తన కవిత్వాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఇటలీ కవి గాబ్రియేలా డి అన్నుంజియొ నుండి ‘గబ్రియేలా’ అనే పదాన్నీ, తీసుకొని ‘గబ్రియేలా మిస్ట్రాల్‌’ గా కేవలం కవిత్వం, రచనల కోసమే పేరు మార్చుకుంది. ఆమె కవితలకు 1945లో నోబెల్‌పురస్కారం లభించింది.

Leave a comment