కొన్నీ సంప్రదాయ సందర్భాల్లో పట్టు చీరెలు ,నగలు పూల జడలతో పాటు మట్టి గాజులు కూడా ప్రత్యేక శోభ ఇస్తాయి. ఎరుపు బంగారం ,ఆకుపచ్చ గాజులు కలిపి వేసుకోవటం కూడా శభ సూచకంగా భావిస్తారు. ఈ మట్టి గాజులు సాదాసీదా రంగులేకాదు ,కుందన్లు,రంగురాళ్ళు అద్దుకొని డిజైనర్ గాజులుగా వచ్చేస్తున్నాయి. రకరకాల చెక్కళ్ళతో సప్త వర్ణాల కలగలిపిన గాజులు ఫ్యాషన్ ,అదృష్టానికి గుర్తుగా కూడా ఉంటున్నాయి. లక్క,ప్లాస్టిక్ గాజులు కూడా పూసలు ,రంగురాళ్ళు ,కుందన్ లు కలుపుకొని ప్యాషన్ ఐకాన్ లలాగా కనిపిస్తున్నాయి. మోడ్రన్ డ్రెస్ లకు కూడా సరిగ్గా సూట్ అవుతాయి ఈ గాజులు.

Leave a comment