ఎంతో మంది దేవుళ్ళు ఉన్నా తొలిపూజ అందుకునేది వినాయకుడే ఈ గణపతి ఆభరణాల్లో కూడా చక్కగా ఒదిగిపోయి కనిపిస్తాడు. ఈ గణనాథుడిని సృష్టించడం చాలా తేలిక అంటారు డిజైనర్స్.అందుకే చెవి పోగులు దగ్గర నుంచి పెండెంట్లూ,నెక్లస్ లు కూడా వినాయకుని రూపలో చాలా అందంగా కనిపిస్తాయి. ఈ విగ్నేశ్వరుడి   రూపాన్ని ధరించడం అదృష్టంగా కూడా భావిస్తారు వెండి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ నగల్లో కూడా వినాయకుడి రూపాలు కనిపిస్తున్నాయి. ముత్యాలు పూసలు నల్లపూసలతో కూడా వినాయకుడి పెండెంట్ వేలాడదీయటం ఇవ్వాలి ట్రెండ్. మ్యాచింగ్ సెట్ లో కమ్మలు, జుంకీలు, ఉంగరాలు నెక్లెస్ లు కలిపి వస్తున్నాయి నగ ఏదైనా వినాయకుడి రూపంతో దానికో ప్రత్యేకత ఉంది.

Leave a comment