అమ్మ కాబోయే వాళ్ళు మామూలుగా నడవడానికి భయపడతారు కానీ అంకిత్ గౌర్ మాత్రం ఐదు నెలల గర్భంతో టి సి ఎస్ వరల్డ్ 10 కె రన్ ను  62 నిమిషాల్లో పూర్తి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇంజనీర్ అయిన అంకిత గత తొమ్మిదేళ్లుగా బెంగుళూరులో జరిగే 10 కె రన్ లో పాల్గొంటూ వస్తోంది. పరిగెత్తటం నా దిన చర్య 2013 నుంచి వరల్డ్ 10 కె రన్ లో పాల్గొంటూ ఉన్న ఈ సారి గర్భవతిగా ఉన్న కనుక మధ్యలో కొన్ని నిమిషాలు బ్రేక్ తీసుకుని అక్కడక్కడా నడిచి రన్ పూర్తి చేశానంటోంది అంకిత. గర్భవతిగా ఉంటూ చక్కని ఎక్స్‌ర్‌సైజ్ తో తేలికైన ప్రసవం ఆరోగ్యం సమకూరుతాయని డాక్టర్లు కూడా ఎప్పటి నుంచో చెబుతున్నారు కూడా. అంకిత ఇందుకు స్ఫూర్తి.

Leave a comment