నేను తల్లి అయినప్పుడే మన దేశంలో ప్రసవాల తీరు, తల్లులు పడే ఇబ్బంది నాకు అనుభవం లోకి వచ్చాయి. వాళ్లకు తగిన సమయానికి తగిన సేవ, సాయం అందించాలని నిర్ణయించుకున్నా బెంగళూరు లో ఆస్ట్రికా మిడ్ వైఫరీ కేంద్రాన్ని ప్రారంభించాను సిజేరియన్ లను ప్రసవ వేదన ను తగ్గించే నైపుణ్యాల గురించి నర్సులు వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తాము అంటున్నారు డాక్టర్ జాహ్నవీ నిలేకని   ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని కూతురు ఆమె తల్లి రోహిణి నీలేకని 30 ఏళ్లుగా సేవా రంగంలో ఉన్నారు ప్రసూతి సమయంలో మాతా శిశు మరణాలను నిరోధించే దిశగా సేవ చేస్తున్నా జాహ్నవి నీలేకని మిలిందా గేట్స్ ఫౌండేషన్ లోనూ యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్స్ ఫండ్ సంస్థ తోను కలిసి పని చేస్తుంది.

Leave a comment