కలలు కనండి ఆ కలలు సాకారం చేసుకొండి అని అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు ఎంతో మంది ఈ ప్రపంచంలో సామాన్య కుటుంబాల నుంచి వచ్చి చక్కగా చుదువుకొని ఎంతో గర్వపడ దగ్గ హోదాల్లోకి వస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వేంసాని లావణ్య ఖండాంతరాలు దాటుకొని అమెరికా వెళ్ళారు. బోధాన రంగం పట్ల ఆసక్తితో ప్రోఫెసర్ గా జీవితం మొదులు పెట్టారు. అమెరికాలోని ఒహియో రాష్ట్ర ప్రభుత్వానికి ఓహియో అకాడమీ ఆఫ్ హిస్టరీ సలహాదారుగా పని చేస్తుంది.విద్యా పరమైన సిలబస్ లో ఇతర ప్రణాళికలు ఆ సంస్థ నుంచే రూపుదిద్దుకొంటాయి. ఆ అకాడమీకి వేంసాని లావణ్య ఉపాధ్యక్షురాలయ్యారు..ఆ సంస్థకు వైస్ ఫ్రెసిడెంట్ అయినా తొలి భారతీయురాలిగా గుర్తింపు లభించిందామెకు.

 

Leave a comment