సముద్ర తీరంలో అక్కడక్కడ కొన్ని తెల్లని కోండలు ఏర్పడి ఉండటం కొన్ని దేశాల్లో కనిపిస్తుంది ,ఎంతో అందంగా ,అద్భుతంగా అనిపించే ఈ తెల్లని కొండల పైన షూటింగ్స్ చేస్తుంటారు . అవి మాములు కొండలు కావు . సుద్ద కొండలు . సముద్రంలో నివశించే ఎన్నో జీవుల పైన షెల్ ఉంటుంది . నత్త గుల్లాలు చూస్తాం కదా వాటికి వుండే షెల్ లాగా . ఆ జీవులు మరణించాక అలల తాకిడికి అవన్నీ ఒక చోటచేరి క్రమంగా పేరుకుపోయి,ఒక గుట్ట లాగా అయిపోతాయి . అవి గట్టిపడి కొండలాగా అయిపోయి నీలిసముద్రంలో అందమైన రూపుతో తేలికనిపిస్తాయి . వాటి లోపల ఉండేది సుద్ద మాత్రమే .

Leave a comment