శ్రావణ మాసపు పూజలు ప్రతి ఇంటా జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించి ప్రతి వస్తువు అంటే అమ్మవారి వెనక ఏర్పాటుచేసే తెర, కలశం, లక్ష్మీ దివ్యలు, అరటి పండ్లు కొబ్బరి చెట్లు వరకు అన్నీ మార్కెట్ లోకి వచ్చేశాయి. వీటిని పూజలో ఉంచుకుని శుభ్రం చేసుకుని భద్రపరుచుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి కి సంబంధించి చక్కని లక్ష్మి రూపం, నగలు, చీరలు, వడ్డాణాలు, వంకీలు, కుచ్చుళ్ళు కుట్టేసిన పట్టు చీరలు అన్ని నేరుగా కొనేయచ్చు. అమ్మవారికి వేసే పువ్వుల జడ బంగారు నగిషీలతో నవరత్నాలతో సెట్ లుగా దొరుకుతున్నాయి. వీటితో స్వయంగా అమ్మవారి అలంకరణ పూర్తి చేయవచ్చు.

Leave a comment