బరువు తగ్గడం కోసం కూడా ఎంతో కొంత కొవ్వు ఆహారంలో ఉండాలి అంటారు ఎక్స్ పర్ట్స్. మరి ఆ కొవ్వు ఏ నూనెలో ఎంచుకోవాలి ఆలివ్, వెన్న, నెయ్యి ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలి .మూడు ఆరోగ్యమే కానీ వాటిలోని పోషకాలు క్యాలరీల ద్వారా అనువైన కొవ్వుని ఎంచుకోవాలి. కీటో డైట్ లో ప్రధాన పాత్ర పోషించే వెన్న, నూనె కు చక్కని ప్రత్యామ్నాయం. పరిమితంగా తీసుకుంటే చక్కని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పాల నుంచి తీసే వెన్నె లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవు. పైగా పోషకాలు ఎక్కువ. ఈ వెన్నతో ఉబకాయం, గుండె జబ్బులు రావు. అత్యంత ఉత్తమ మైనదిగా చెప్పుకొనే ఆలివ్ ఆయిల్ లో మెనో సాచురేటెడ్ ఫ్యాటి యాసిడ్లు ఉంటాయి. ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్ లో మిగతా ఆలివ్ నూనెలో లేనన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి .ఇక నెయ్యి తింటే బరువు పెరుగుతామన్నా అపోహల  లోంచి బయటికి రావడం చాలా అవసరం .నెయ్యి లోని ఎంజైమ్లు పేగులకు నష్టం కలిగించవు తేలికగా అరుగుతుంది. వెన్న లాగే దీన్ని పరిమితంగా వాడుకోవాలి. ఈ మూడింటి మధ్య వ్యత్యాసాన్ని బట్టి అన్నింటికంటే నెయ్యి వాడకం ఆరోగ్యం అంటున్నారు డాక్టర్లు .దీనిలో విటమిన్ ఎ,డి,కె మొదలైన ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్లు ఉంటాయి. స్మోకింగ్ పాయింట్ అధికం కనుక అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటుంది .

Leave a comment