సెర్బియా ఒకప్పటి రోమన్ సామ్రాజ్య ప్రాంతం . రోమన్ చక్రవర్తుల పాలనలో నిర్మించిన రాజధాని నగరాల్లో నాలుగు ఇప్పటికి సెర్బియాలోనే ఉన్నాయి . ఐరోపాలోని సెర్బియా రాజధాని బెల్ గ్రాడ్. సెర్బియా సహజమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆకాశాన్ని తాకే పర్వతాలు వాటిపైగడ్డి మైదానాతో ఎంతో అందంగా ఉంటుంది . అయితే ఇక్కడ ఒక ప్రాంతాన్ని డెవిల్స్ టౌన్ అని స్దానికులు పిలుస్తారు . ఇక్కడ స్థంబాల మాదిరిగా మట్టితో ఏర్పడ్డ చిత్రమైన నిర్మాణాలు ఉంటాయి .220కి పైగా ఉన్న పొడవైన స్థంబాలు నేల కోతవల్ల ఏర్పడ్డ నిర్మాణాలని పరిశోధకులు చెపుతారు . అయితే ఇవి దయ్యాలే నిర్మించాయని స్దానికులు బలంగా నమ్ముతారు . ఈ దేశంలో ఇంకో చిత్రం ఇక్కడ జనాభా 70 లక్షలు . విల్లు వాడుతున్న ఫోన్లు 90 లక్షలు . ప్రజల కంటే మొబైల్ ఫోన్ సంఖ్య ఎక్కువ . ఈ సాంకేతికతను బానిసలై సెర్బియా వాసులు సంతాన సాఫల్యతను కూడా కోల్పోతున్నారట .
Categories