Categories
WhatsApp

గిఫ్ట్ జీవితాంతం గుర్తుండాలి.

ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు దగ్గరి వాళ్ళకు, ఫ్రెండ్స్ కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనే సందర్భంలో పడిపోతాం. ఫ్రెండ్స్ని అడిగితె రకరాల ఐడియాలు చెప్పారు. కానీ చివరకు ఎం కావాలి దగ్గరే ఆగిపోతాం. బహుమతి సర్ ప్రైజింగ్ గా వుండాలి. వాళ్ళకి నచ్చే బ్రాండ్, సువాసనలు, ఇష్టాలు ఒక లిస్ట్ అనుకుంటే అసలేం కొంటె బావుంటుందో తేలుతుంది. గిఫ్ట్ షాపింగ్ కు మాత్రం ఎవరితోడు వద్దు. రెండవ అభిప్రాయంతో కన్ ఫ్యుజన్ వస్తుంది. పైగా మనం గిఫ్ట్ ఇవ్వాలనికున్న వ్యక్తి గురించి వారికి తలియదు. బడ్జెట్ సమస్య లేకపోతె, ఇవ్వదలుచుకొన్న వారు ప్రేత్యేకమైన వారైతే ఆభరణాలు, వాచీలు లేదా యాంటిక్ అలంకరణ వస్తువు ఏదైనా జీవిత కాలం గుర్తుండి పోయే ఖరీదైన వస్తువు ఇవ్వచ్చు ఇన్నోవేటివ్ గా ఎగ్జయిటింగ్ గా చేయాలి. రిబ్బన్లు స్టిక్కర్లు, గ్లిట్టర్లు ఏవైనా ఉపయోగించి, చక్కని సందేశంతో ఉన్న వ్యక్తిగత కార్డు జోడించి ఇవ్వాలి.

Leave a comment