వాటర్ మిలన్ తినేసి గింజలు పారేయకండి . ఆ గింజల్లో లైసిన్ అధికంగా ఉంటుంది. ఇది వధుమేహానికి మందు అంటున్నారు డాక్టర్లు. ఈ గింజల్లో క్యాలరీలు తక్కువగా మెగ్నిషియం,ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణులకు మంచి ఆహారం .పుచ్చకాయలోనూ పోషక విలువలుంటాయి. అతి తక్కువ క్యాలరీలు 100 గ్రాముల వాటర్ మిలన్ లో 30 కేలరీలుంటాయి. శాచ్యురేటెడ్ ఫ్యాట్ అసలుండదు. ఫైబర్ ఉంటుంది. కండరాలు బలంగా తయారవుతాయి. సలాడ్ లాగా ఇతర పండ్ల ముక్కలతో కలిపి కూడా చక్కగా తినవచ్చు.

Leave a comment