ఈ రోజు సమ్మక్క మేడారం జాతరలో గద్దెపైన ఆసీనురాలై భక్తులకు దర్శనం ఇస్తుంది.కన్నెపల్లి నుంచి సారలమ్మను కూడా మేళతాళాలతో జాతరకు తీసుకుని వచ్చారు.
రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను ఆసియా ఖండంలో అత్యంత ప్రజాదరణ పొందినది.కాకతీయుల రాజ్య పరిపాలనకు బలైన వీరులు.సమ్మక్క కుమారుడు జంపన్న సంపెంగ వాగులో పడి ఆత్మాహుతి చేసుకున్నాడు కావున దానిని ఇప్పుడు జంపన్నవాగు అంటారు.సమ్మక్క చివరి వరకు పోరాడుతూనే వుంది కానీ కాకతీయులు వెనుక నుంచి  పొడిచారు.సమ్మక్క యుద్ధ భూమి నుంచి నిష్క్రమిస్తూ చిలుకల గుట్ట వైపు నడుస్తూ అదృశ్యం అయ్యింది.అక్కడి ప్రజలు ఆమెను వెతుకు చుండగా “కుంకుమ భరిణ”రూపంలో కనిపించింది.అమ్మ కు బంగారం అంటే బెల్లంను మొక్కుగా చెల్లిస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి, బెల్లం

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment