చేతిలో చాక్ పీస్ చిక్కితే చాలు పిల్లలు ఇల్లంతా వాళ్ళ ఆర్ట్ తో నింపేస్తారు. వాళ్లకు వేసే బొమ్మల్లో ఇష్టమైనదేదో ఉంటుంది . దాన్ని మళ్ళీ మళ్ళీ గీస్తుంటారు. ఆ ఇష్టమైన చిత్రం ఒక బొమ్మగా మారిపోయి వాళ్ళ చేతుల్లోకి వస్తే ఇలాంటి ఆలోచనలు అమెరికాలో కొన్ని సంస్థలు ఇలాంటి బొమ్మలు తయారుచేస్తున్నారు. మన పిలల్లకు వాళ్ళు గీసిన బొమ్మలను బహుమతిగా ఇవ్వాలనిపిస్తే బడ్ సీస్ ద్వారా  తెప్పించుకోవచ్చు. ART@ BUDSIES.COM  మెయిల్ చేస్తే సంస్థకు సంభందించిన వివరాలు ఫోన్ నెంబర్ దొరుకుతాయి. ఇలాంటివి కాన్సర్ చికిత్స చేయించుకుంటున్న చిన్న పిల్లల కోసం ఇవ్వచ్చు. పేద పిల్లలకు పంచవచ్చు. మనింట్లో బంగారుపాప పుట్టినరోజు వస్తే ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే . పిల్లలు గీసే చక్రాల్లాంటి కళ్ళు పుల్లలాంటి కాళ్లు, చేతులు ఒక్కసారి నాలుగైదు చేతులు పెద్దపొట్ట ఇవన్నీ యధాతధంగా బొమ్మలై పోయి మనింటికొస్తాయి. childsown .com  ట్రై చేయచ్చు.

Leave a comment