ఇప్పుడు ఆఫీసుల్లో పొడవాటి అద్దాల టీ పాయిలు వస్తున్నాయి. మీటింగ్ హాల్స్ లో రేశప్షన్లో ఈ అద్దాల టీ పాయిలు బాగంటాయి. అయిటే ఈ టేబుల్ పైకి పువ్వుల స్టాండ్లు, పూల డెకరేటివ్లు బావుండవు. గాజు పాత్రల్లో రంగురాళ్ళు పోసి సువాసన కోసం ఎండిన పూలు వేసి ఉంచుతున్నారు. వాటితో పాటు మురానో గ్లాస్ కాండిస్ పేరుతో అచ్చంగా నోరూరించే చాక్లెట్స్ మాదిరిగా  గ్లాస్ చాక్లెట్లు కుడా వస్తున్నాయి. అలంకరణ కోసం గాజు పాత్రల్లో చిన్ని చిన్ని పూలు, రంగుల రాళ్ళు, చాక్లెట్స్ అన్ని కలిపేసి ఉంచేస్తూన్నారు. వీటిపైకి  అనుకోకుండా చూపు పోనిస్తే అచ్చం చాకెట్ల లాగే ఉంటాయి, ముట్టుకుంటే కానీ తెలియదు గాజు అని.

Leave a comment