గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల  పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా ప్రవర్తించటానికి కారణాలంటారు. హైస్కూల్ చదువుల సమయానికి పిల్లలపై అంతులేని చదువు బాధ్యత ఉంటోంది. మిగిలిన కాస్తో కూస్తో టైం సహజంగా ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. నిద్ర వేళలు తగ్గిపోతున్నాయి. విశ్రాంతి సమయం కూడా తగ్గుతోంది. పిల్లల్ని శారీరిక ఫిట్ నెస్ వైపుగా ప్రోత్సహించమంటున్నాయి. అధ్యయనాలు. అప్పుడే వారి ఆలోచన ధోరణి జ్ఞాపకశక్తి పెరుగుతూ వున్నాయి. పిల్లలు అభ్యాస ప్రక్రియలోని వుంటారు . చూసి చదివి నేర్చుకుని గుర్తుపెట్టుకుంటారు. ఫిట్ నెస్ లేని వాళ్లలో ఈ జ్ఞాపక శక్తి  చురుకుదనం నశిస్తున్నాయి. పిల్లల్ని ఇండోర్ గేమ్స్ కో కంప్యూటర్ గేమ్స్ కో పరిమితంచేయకుండా బయట ఆటలాడేందుకు లేదా ఇతర వ్యాయమాలకు ప్రోత్సహించండి చదువుకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం అంటున్నారు.

Leave a comment